దైవ ప్రార్థన

దైవ ప్రార్థన

1)         శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
            ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వవిఘ్నోపశాంతయే ||
            వత్రుండ మహాకాయా కోటిసూర్య సమప్రభ |
            నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా ||

2)        వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం
            వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాంపతిం |
            వందే సూర్య శంశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం
            వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరమ్‌ ||

3)        ఎవ్వనిచే జనించు జగ మెవ్వని లోపలనుండు లీనమై
            యెవ్వనియందు డిందు బరమేశ్వరుడెవ్వడు మూలకారణం
            బెవ్వడనాది మధ్యలయుం డెవ్వడు సర్వము దానయైన వా
            డెవ్వడు వాని నాత్మ భవు నీశ్వరునే శరణంబు వేడెదన్‌ ||

4)        వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే
            నమోవై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమోనమః ||

5)        అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే
            సదైక లింగ రూపాయ విష్ణవే సర్వజిష్ణవే ||

6)        నమామి నారాయణ పాదపంకజమ్‌
            కరోమి నారాయణ పూజనమ్‌ సదా |
            వదామి నారాయణ నామ నిర్మలం
            స్మరామి నారాయణ తత్త్వమవ్యయమ్‌ ||

7)         శ్రీరామ ! రామ ! రామేతి
            రమే రామే మనోరమే |
            సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ||
            శ్రీరామనామ వరానన ఓం నమ ఇతి ||

8)        యత్ర యత్ర రఘునాథ కీర్తనమ్‌
            తత్ర తత్ర కృత మస్త కాంజలిమ్‌ |
            బాష్పవారి పరిపూర్ణ లోచనమ్‌
            మారుతిం నమత రాక్షసాంతకమ్‌ ||

9)        దుర్గేతి భద్రకాళీతి విజయావైష్ణవీతిచ
            కుముదా చండికా కృష్ణా - మాధవీ కన్యకేతిచ |
            మాయా నారాయణీశానా
            శారదే త్యంబికేతిచ భజిష్యంతి ||

10)      శ్రీరుక్మిణీశ ! కేశవ !
            నారద సంగీతలోల ! నగధరశౌరీ !
            ద్వారక నిలయ ! జనార్దన !
            కారుణ్యము తోడ మమ్ము కావుము కృష్ణా !

11)       నీవే తల్లివి తండ్రివి
            నీవే నా తోడు నీడ సఖుడౌ
            నీవే గురుడవు దైవము
            నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా !

12)      దండమయా ! విశ్వంభర
            దండమయా ! పుండరీక దళనేత్రహరీ !
            దండమయా ! కరుణానిధి

            దండమయా ! నీకు నెపుడు దండము కృష్ణా !